న్యూఢిల్లీ : భారతదేశం జపాన్‌ను అధిగమించి 4.18 ట్రి లియన్ డాలర్ల పరిమాణంతో ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2030 నాటి కి జర్మనీని అధిగమించి మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనదేశం అవతరించనున్నదని ప్రభుత్వం తెలిపింది. వృద్ధి రేటు ఆశ్చర్యంగా వేగంగా పెరుగుతుండడంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెం దుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా భారతదేశం నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతదేశం స్థూల దేశీయ ఉత్పత్తి(జిడిపి) 8.2 శాతం పెరిగింది. ఇది మొదటి త్రైమాసికంలో 7.8 శా తంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఇది 7.4 శాతంగా ఉంది. 4.18 ట్రిలియన్ అమెరికా డాలర్ల మేర జిడిపి విలువతో భారతదేశం జపాన్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలో అతి పెద్ద నాల్గో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2030 నాటికి 7.3 ట్రిలియన్ల డాలర్ల జిడిపి అంచనాతో రానున్న రెండున్నర లేదా మూడేళ్లలో జర్మనీని మూడో స్థానం నుంచి పక్కకు నెట్టి భారతదేశం మూడో స్థానం చేరగలదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం2025 లో చేపట్టిన సంస్కరణలపై విడుదల చేసిన ఓ ప్రకటన ఈ విషయం తెలిపింది.
ప్ర పంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, రెండో స్థానంలో చైనా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జిడిపి ఆరు త్రైమాసికాలను అధిగ మించి గరిష్టస్థాయికి విస్తరించడంతో వృద్ధి వేగం ఆశ్చర్యకరంగా పెరిగింది. అంతర్జాతీయ సంస్థలు భారతదేశం సాధిస్తున్న వృద్ధి రేటును ఆశాభావంతో చూస్తున్నాయి. 2026లో ప్రపంచ బ్యాంకు భారతదేశం 6.5 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. 2026లో 6,4 శాతం 2027లో 6.5 శాతం వృద్ధితో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జి-20 ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ఇక ఐఎంఎఫ్ 2025కి సంబంధించి తన అంచనాలను 6.6 శాతానికి పెంచడం విశేషం. ఎస్ అండ్ పి సంస్థ భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2025 అంచనాను 7.2 శాతానికి పెంచింది. అలాగే ఫిచ్ 2026 సంవత్సరానికి తన అంచనాను 7.4 శాతానికి పెంచింది.