బిగ్ బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ లిన్ చరిత్ర సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో 4000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా లిన్ రికార్డు నెలకొల్పాడు. బుధవారం(డిసెంబర్ 31) బ్రిస్బేన్ హీట్-అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో లిన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. బ్రిస్బేన్ హీట్ నిర్దేశించిన 122 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో లిన్ 49 బంతుల్లోనే 192.68 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 79 పరుగులు చేశాడు. లిన్. అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు, 35 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా ఆటగాడికి 65 పరుగులు అవసరం కాగా, తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఈ అరుదైన ఫీట్ ను చేరుకున్నాడు.
కాగా, బిబిఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ లిన్(129 ఇన్నింగ్స్‌లలో 4065 పరుగులు) తర్వాత.. ఆరోన్ ఫించ్(105 ఇన్నింగ్స్‌లలో 3311 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (115 ఇన్నింగ్స్‌లలో 3282 పరుగులు), మోయిసెస్ హెన్రిక్స్(137 ఇన్నింగ్స్‌లలో 3188 పరుగులు), డి’ఆర్సీ షార్ట్(102 ఇన్నింగ్స్‌లలో 3138 పరుగులు)లు ఉన్నారు.