బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, మిలాప్ జవేరి కలయికలో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు. కృతి ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేయగా, ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్తున్నారు. గతంలో కృతి… హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీలో నటించినప్పటికీ అందులో కృతి లీడ్ రోల్ చేయలేదు. అందుకే కృతి ఈ సినిమాతోనే బాలీవుడ్ డెబ్యూ చేయనుందని అందరూ భావిస్తున్నారు.