అమరావతి: డిసిఎంను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. డిసిఎంలో మంటల చెలరేగి డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డిపల్లి శివారులో డిసిఎంను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డిసిఎంలో మంటల చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. క్లీనర్ గాయాలతో బయటపడ్డాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన స్వామిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం కోసం స్థానిక సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.