పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఈబిసి, మైనారిటీలు, శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (పిఎంఎస్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరు, పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించడానికి ఆన్‌లైన్ : http://telanganaepass.cgg.gov.in (ఈ పాస్ పోర్టల్) ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద ఫ్రెష్, రిన్యువల్ స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం ఆన్‌లైన్‌లో కళాశాలలు, విద్యార్థుల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 2025-26 విద్యా సంవత్సరానికి కళాశాలలు,
విద్యార్థుల రిజిస్ట్రేషన్ టిజి ఈ పాస్ వెబ్‌సైట్‌లో గత జులై 1 నుండి ప్రారంభమై 31 డిసెంబర్-తో గడువు ముగిసింది. ఇప్పటివరకు, 10,89,233 మంది విద్యార్థుల్లో 7,82,779 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. సెట్‌లు అంటే కెఎల్‌ఎన్‌ఆర్, పిజిసెట్, లా సెట్ చివరి దశ, ఎస్‌డబ్లు 2 డేటా ఈ-పాస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడలేదు . విద్యార్థుల తాజా నమోదు కోసం విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ నమోదు కోసం సెట్ డేటా అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు, కళాశాలల యాజమాన్యాలు ఈ-పాస్‌లో నమోదు చేసుకోవాలనుకునే అన్ని కళాశాలలు, విద్యార్థులు విద్యా సంవత్సరానికి దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడింగించినట్లు సాంఘీక సంక్షేమ శాఖ వెల్లడించింది.