న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం 2026సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధి,సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణకు మన నిబద్ధత మరింత బలోపేతం చేద్దామని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తికి,సానుకూల మార్పుకు కొత్త సంవత్సరం సంకేతం అవుతుందన్నారు. ఆత్మ పరిశీలనకు, తాజా నిర్ణయాలకు ఇదొక అవకాశమని వివరించారు. మన జీవితాల్లో కొత్త సంవత్సరం ఆనందం, పురోభివృద్ధి, ఆనందం అందించగలదని ఆశిస్తున్నట్టు చెప్పారు.