ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలు బుధవారం జరిగాయి. ఢాకాలో అశేష అబిమానుల సమక్షంలో ఈ 80 సంవత్సరాల బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బిఎన్‌పి) దిగ్గజనాయకురాల ఖలీదా తుది వీడ్కోలు ఘట్టం ముగిసింది. కార్యక్రమానికి భారతదేశం తరఫున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ఈ నేపధ్యంలో ఖలీదా కుమారుడు తారీఖ్ రెహ్మన్‌తో కొద్ది సేపు మాట్లాడారు. దేశ పార్లమెంట్ వేదిక అయిన షేర్ ఏ బంగ్లా నగర్‌లో దేశ మాజీ అధ్యక్షులు , ఖలీదా భర్త జియాఉర్ రెహ్మన్ సమాది సమీఫంలోనే ఖలీదా భౌతిక కాయాన్ని ఖననం చేశారు.
బిఎన్‌పి తాత్కాలిక అధ్యక్షులు తారిఖ్ రెహ్మన్ కాబోయే దేశ పార్లమెంట్ ఎన్నికలలో పోటికి దిగేందుకు సిద్ధం అయ్యారు. ఆయననే తదుపరి ప్రధాని అవుతారనే వార్తలు వెలువడ్డాయి. ఈ దశలో ఆయనతో కొద్ది సేపు జైశంకర్ మాట్లాడటం కీలక పరిణామం అయింది. ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ పంపించిన సంతాప లేఖను రెహ్మన్‌కు జై శంకర్ అందించారు. ఢాకాకు వచ్చిన పాకిస్థాన్ పార్లమెంట్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాధిక్‌ను పలకరించారు. నేపాల్, దక్షిణాసియా దేశాలకు చెందిన కొందరు నేతలు, ప్రతినిధి బృందాలు కూడా ఖలీదా జియా అంత్యక్రియలకు తరలివచ్చాయి.