కన్నడ రాక్‌స్టార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’. మలయాళీ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధచంచిన అప్‌డేట్స్ అన్ని ఆకట్టకున్నాయ. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి నయనతార ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె ‘గంగ’ అనే పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు పవర్‌ఫుల్ లుక్‌లో మోడ్రెన్ డ్రెస్‌లో నయనతార పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను నిజం చేస్తూ.. ఒకరి తర్వాత మరోకరు పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రంలో కియారా అడ్వాణీ.. నదియా పాత్రలో, ఎలిజిబెత్ పాత్రలో హ్యుమా ఖురేషి కనిపించనున్నారు. ఈ చిత్రం చిన్నారుల కోసం కాదని.. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అని ముందు నుంచి చెబుతున్నారు. ఈ సినిమా 2026, మార్చి 19వ తేదీన విడుదల కానుంది.