జనగామ: భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామచెర్లలో చోటు చేసుకుంది. చిన్న రామచర్లలో రామ్ రెడ్డి, లక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. గత కొంతకాలంగా భార్యభర్తులు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అనారోగ్య పాలైన ఇద్దరూ భార్యాభర్తలు ఏమి చేయాలో తోచక ఇద్దరు పురుగుల మందు తాగి అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్ఐ హమీద్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.