ధర్మారం: జగిత్యాల జిల్లా ధర్మారం మండలం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. గంజాయి మత్తులో విద్యార్థుల టూరిస్ట్ బస్సుపై పోకిరిల దాడి చేశారు. దీంతో గంజాయి బ్యాచ్ పై విద్యార్థులు తిరగబడ్డారు. వరంగల్ లోని ఓ విద్యా సంస్థకు చెందిన విద్యార్థిని, విద్యార్థుల ముందే పోకిరీలు హంగామా చేశారు. బస్సు డ్రైవర్ తో పాటు విద్యార్థులతో గొడవకు దిగి విచ్చలవిడిగా ప్రవర్తించడంతో యువకులపై విద్యార్థులు తిరగబడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. విద్యా సంస్థ, పెట్రోల్ బంక్ యజమాని పోకిరీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందే పలువురితో గొడవపడి పెట్రోల్ బంక్‌కి చేరుకుని అక్కడ సిబ్బందితో యువకులు గొడవపడ్డారు.