హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్ చిక్కుల్లో పడ్డాడు. తన పోలీసు కేసు నమోదైంది. సోషల్‌మీడియాలో అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ సినీ నటి కరాటే కళ్యాణీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతర కంటెంట్‌ను ప్రచారం చేశారని ఫిర్యాుదలో పేర్కొన్నారు. దీంతో అన్వేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్వేష్‌పై ఖమ్మంలోని ఖానాపురంహవేలి పోలీసు స్టేషణ్‌లో ఇప్పటికే కేసు నమైదైంది.
ఇన్‌స్పెక్టర్ భానుప్రకాశ్ కథనం ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన అన్వేష్ అనే యువకుడు విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానెల్‌లో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువుల పూజించే సీతాదేవి, ద్రౌపదీ దేవిలపట్ల అసభ్యంగా వీడియోలు చేశాడు. దీంతో దానవాయిగూడేనికి చెందిన జి.సత్యనారాయణ రావు అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు