న్యూజిలాండ్ దేశం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. 2026కు ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆక్లాండ్‌లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. దేశంలోనే ఎత్తైన నిర్మాణం (240 మీటర్లు) ‘స్కైటవర’ వేదికగా బాణసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. అంతకు ముందు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి అనే ద్వీపదేశన్ని న్యూ ఇయర్ పలకరించింది.
న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సరం సంబరాలు మొదలయ్యాయి. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. ఇటీవలి ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు పకడ్భందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. జపాన్, ఉత్తర కొరియా, తైవాన్, చైనా, మంగోలియా తదితర దేశాల్లో సంబరాలు ప్రారంభంకానున్నాయి.