‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి రిద్ది కుమార్ ప్రభాస్ తనకు చీరను గిఫ్ట్‌గా ఇచ్చాడని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. మూడేళ్ల క్రితం ఇచ్చిన ఈ చీరను ఆ కార్యక్రమంలో కట్టుకొచ్చాని చెప్పింది. దీంతో ఆమె మాటలు సోషల్‌మీడియాను షేక్ చేసింది. హీరోయిన్‌కి చీర ఎందుకు ఇచ్చాడు అంటూ ఎవరికి తోచిన విధంగా కామెంట్ చేశారు. అయితే చీర కానుకగా ఇవ్వడం వెనుక అసలు కథను రిద్ధి తెలిపింది.
ప్రభాస్ పుట్టిన రోజున తను ప్రభాస్‌కి ఓ గిఫ్ట్ ఇస్తే.. అందుకు రిటర్న్ గిఫ్ట్‌గా తనకు చీరను కానుకగా ఇచ్చాడని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిద్ద స్ఫష్టం చేసింది. ‘‘మూడేళ్ల్ర క్రితం నేను రాజాసాబ్ సెట్స్‌కి వచ్చిన రోజే ప్రభాస్ పుట్టిన రోజు.. ఆయకు ఏదైనా ఒక కానుక ఇవ్వాలనుకున్నాను. కానీ, ఆ సమయంలో కుదరలేదు. దీపావళి ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగలో కర్ణుడికి సంబంధించిన ఓ పుస్తకాన్ని ప్రభాస్‌కు ఇచ్చాను. నిజజీవితంలో కూడా ప్రభాస్ స్వభావం కర్ణుడికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయనకు ఆ బుక్ ఇచ్చాను. దానికి రిటర్న్ గిఫ్ట్‌గా నాకు హనుమాన్ చాలీసా పుస్తకంతో పాటు కొన్ని చాక్లెట్స్, వైట్ శారీ ఇచ్చారు. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాను. నాటి నుంచి ఆ హనుమాన్ చాలీసా బుక్ నా బ్యాగ్‌లోనే ఉంది. అయితే, కొద్దిరోజుల తర్వాత కల్కి సినిమాలో కర్ణుడిగా ప్రభాస్ నటించారని తెలిసి ఆశ్చర్యపోయాను’’ అని రిద్ధి
పేర్కొంది.