స్కూటీపై వెళ్తున్న యువతి ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి దుర్మరణం చెందింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న లిఖిత (27) మంగళవారం స్కూటీపై వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడింది. అదే సమయంలో అటు వైపు నుండి వస్తున్న ఒక ప్రైవేటు స్కూలు బస్సు టైర్ కింద పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.