మన తెలంగాణ/ హైదరాబాద్: సందడిగా సాగిన సౌత్‌జోన్ ఆక్వాటిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు సిమవారం ముగిశాయి. గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుపాటు సాగిన ఈ పోటీల్లో తెలంగాణ స్విమ్మింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో హోరాహోరీగా సాగిన పోరులో తెలంగాణ జట్టు 452 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. 1040 పాయింట్లతో కర్నాటక జట్టు తొలిస్థానం కైవసం చేసుకుంది.