ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఎప్‌సెట్(ఇఎపిసెట్)తో సహా టిజి ఐసెట్, టిజి పిజిఇసెట్ షెడ్యూల్ ఖరారైంది. మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరుగనున్నాయి. మే 4,5 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9,10,11 తేదీలలో ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ ఎప్‌సెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. మే 12న ఎడ్‌సెట్, మే 13, 14 తేదీలలో ఐసెట్, మే 15న ఇసెట్, మే 18న లాసెట్, పిజిఎల్‌సెట్, మే 28,31 తేదీలలో పిజిఇసెట్, మే 31 నుంచి జూన్ 3 వరకు పిఇసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ప్రవేశ పరీక్షల ఫీజులో ఈసారి ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. త్వరలో సెట్ కమిటీలు నిర్వహించి పూర్తి స్థాయి షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్..
టిజి ఇఎపిసెట్ (అగ్రికల్చర్, ఫార్మసీ) : మే 4, 5 తేదీల్లో
టిజి ఇఎపిసెట్ (ఇంజినీరింగ్) : మే 9,10, 11 తేదీలలో
టిజి ఎడ్‌సెట్ : మే 12
టిజి ఐసెట్ : మే 13, 14 తేదీలలో
టిజి ఇసెట్ : మే 15
టిజి లాసెట్, పిజిఎల్‌సెట్: మే 18
టిజి ఇసెట్ : మే 28 నుంచి 31 వరకు
టిజి పిఇసెట్ : మే 31 నుంచి జూన్ 3 వరకు