హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష ఉప నేతలను నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతలుగా(డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు)గా హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు. శాసనమండలిలో బిఆర్ఎస్ ఉపనేతలుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, విప్‌గా దేశపతి శ్రీనివాస్‌లను పార్టీ అధినేత కెసిఆర్ నియమించారు.