న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక బడ్జెట్ కోసం ఆర్థిక వేత్తల, వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం భేటీ నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెరీ, నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం, ఆయోగ్ ఇతర సభ్యులు , ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 202627 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.