న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమా రుడు రైహాన్ వాద్రా తన దీర్ఘకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో నిశ్చి తార్థం చేసుకున్నారు. ఈ మేరకు కుటుంబ సన్ని హిత వర్గాలు తెలిపాయి. ఇరు కుటుంబాలతో పాటు రైహాన్, అవివా కొన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నారని వారు చెప్పారు. ఒక కార్యక్రమంలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం కుటుంబం, స్నేహితులతో కలిసి రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 25 ఏళ్ల రైహాన్, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలకు మొదటి సంతానం. అతని సోషల్ మీడియా హ్యాండిల్స్ అతన్ని కళాకారుడు, ఫోటోగ్రాఫర్ గా వివరిస్తున్నాయి. ప్రియాంక గాంధీ తన సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కుటుంబ సభ్యులతో కలిసి నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఈ మధ్యనే రైహాన్ అవివా బేగ్‌తో పెళ్లి ప్రస్తావన తీసుకురావడం, ఆమె అంగీకారం, కుటుంబసభ్యులు అంగీకారం జరిగాయని కుటుంబ వర్గాలు తెలిపాయి. 25 ఏళ్ల రైహాన్ వద్రా ఫొటో గ్రాఫర్. ప్రకృతి, వన్య ప్రాణులపై దృష్టి సారించే ఫోటో గ్రాఫర్. అతడి పనితనం ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కన్పించింది. కాగా, అవివా బేగ్ ఢిల్లీలో ప్రసిద్ధ కుటుంబానికి చెందిన అమ్మాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ తో పాటు సృజనాత్మక వెంచర్లలో బిజీగా ఉన్నారు.