గంభీర్‌పై మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు
లండన్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్‌పై ఇంగ్లండ్ మాజీ స్టార్ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ రెడ్ బాల్ క్రికెట్‌ను అర్థ చేసుకోవడంలో విఫలమయ్యాడని, రెడ్ బాల్ క్రికెట్ అర్థం కావాలంటే తొలుత రంజీ మ్యాచ్‌లకు కోచ్‌గా వ్యవహరించాలని సూచించాడు. రంజీల్లో సహచర కోచ్‌లతో కలిసి వ్యూహాలు రచించడం నేర్చుకోవచ్చని, అంతేకాకుండా జట్టు కూర్పులో మెలుకువలు తెలుసుకోవచ్చని పనేసర్ పేర్కొన్నాడు. వైట్ బాల్ క్రికెట్లో విజయవంతమైనా.. రెడ్ బాల్ క్రికెట్‌కు వచ్చేసరికి ఫెయిల్యూర్ చూస్తున్నాడని మాజీ దిగ్గజం అన్నాడు. ఇందుకు రంజీలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపాడు.
కాగా, గంభీర్ నాయకత్వం.. ఛీప్ సెలెక్టర్ అజిత్ అగర్కర్‌లపై మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు ఓ ప్రయోగశాలగా మార్చేశారని, మ్యాచ్‌లో అప్పటికప్పుడు వ్యూహాలతో జట్టును తీవ్రంగా దెబ్బతీశారి ఇంటాబయట విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గంభీర్‌పై పనేసర్ వ్యాఖ్యలు చర్చనియాంశంగా మారాయి.