టి-20 ప్రపంచకప్-2026 కోసం ప్రకటించిన జట్టులో శుభ్‌మాన్ గిల్‌కు చోటు దక్కలేదు. వరుస వైఫల్యాలతో బాధపడుతున్న గిల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి అలాగే జట్టు నుంచి తప్పించారు సెలక్టర్లు. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు టి-20ల సిరీస్‌లోనూ ఇదే జట్టు తలపడనున్నట్లు తెలిపారు. దీంతో ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే టీం ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ మాత్రం గిల్‌కు మద్ధతుగా నిలిచారు. గిల్ తిరిగి టి-20 జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘టిం ఇండియాకు ఎంపిక విషయంలో తీవ్రమైన పోటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే గిల్‌కు దారులన్నీ మూసుకుపోలేదు. అతడు తిరిగి టి-20 జట్టులోకి వస్తాడు. శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. అతడు కచ్చితంగా పునరాగమనం చేస్తాడు. అలాగే గిల్ టెస్ట్ కెప్టెన్ అన్న విషయం మర్చిపోకూడదు’’ అని భజ్జీ అన్నారు.