యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నం దునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూ త్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్ర లు పోషించారు. జనవరి 1న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ “ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి కారణం డైరెక్టర్ వరుణ్ సినిమాని చాలా డిఫరెంట్ చూపించాడు.
చాలా ఆసక్తికరంగా సినిమా తీశాడు. అలాగే ఈ సినిమా టికెట్ కేవలం 99 రూపాయలు మాత్రమే”అని అన్నారు. హీరో శ్రీ నందు మాట్లాడుతూ “2026 తెలుగు సినిమా సైక్ సిద్ధార్థతో ప్రారంభం కాబోతుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. 100 శాతం చెబుతున్నా ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా చాలా బలంగా ఉంటుంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. థియేటర్స్‌కి వచ్చి గట్టిగా కేకలు వేసి ఫుల్‌గా ఎంజాయ్ చేసే తెలుగు ఆడియన్స్‌కి ఈ సినిమా అంకితం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ యామిని భాస్కర్, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ సాయి పాల్గొన్నారు.