మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి బాగున్నారా అని పలకరించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ ఆయనను పలకరించి అభివాదం చేశారు. అనంతరం కెసిఆర్ ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం సభ ప్రారంభమైన రెండు నిమిషాల తరువాత కెసిఆర్ నంది నగర్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు.