న్యూయార్క్: రెండు హెలికాప్టర్లు ఢీకొన్న సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.