మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. తాజాగా విడుదలైన ప్రత్యేక పోస్టర్‌లో చిరంజీవి స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. విడుదలకు కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని తెలియజేస్తూ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ పోస్టర్‌లో చిరంజీవి కొబ్బరి బోండం తాగుతూ స్టైలిష్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘మన శంకరవరప్రసాద్ గారు’ విడుదల కానుంది.