తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు 13 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం భక్తులకు 08 గంటల సమయం పడుతుండగా శీఘ్రదర్శనం, సర్వ దర్శనం కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఆదివారం స్వామివారిని 85,823 భక్తులు దర్శించుకున్నారు. 23,660 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.80 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.