మన తెలంగాణ/హైదరాబాద్: పునర్ వ్య వస్థీకరించిన జిహెచ్‌ఎంసితో పాటు ఫ్యూ చర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలు గు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ, నే ర నియంత్రణలో భాగాంగా పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న మూ డు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చే శారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్ పోర్టు, బుద్వేల్ హైకో ర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబా ద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలు పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్‌సి పురం, అమీన్ పూర్ తదితర ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి.
రాచకొండ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజ్‌గిరి పేరుతో కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. కీసర, శామీర్‌పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్‌పిని నియమించనున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు కమీషనరేట్లకు పోలీస్ కమిషనర్లను, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్‌పిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త కమిషనర్లు వీరే..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా సుధీర్‌బాబు నియమితులయ్యా రు. రాచకొండ కమిషనరేట్‌ను మల్కాజ్‌గిరిగా పేరు మార్చి కమిషనర్‌గా అవినాశ్ మహంతిని సైబరాబాద్ నుంచి బదిలీ చే శారు. ఆయన స్థానంలో డాక్టర్ ఎం.రమేశ్‌ను నియమించారు. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి యాదా ద్రి భువనగిరి జిల్లాకు ఎస్‌పిగా అక్షాంశ్ యాదవ్‌ను నియమించారు.