హైదరాబాద్: టీమిండియాలోని ఆటగాళ్లు పర్‌ఫ్యూమ్ వాసన పీల్చి దాని గాఢతను చెబుతారని, పాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మాత్ర నిపుణుడిలా ఆయిల్ శాతాన్ని లెక్కగడుతారని ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తెలిపారు. బుమ్రాకు పర్‌ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టమని, వాటిపై మంచి అవగాహన ఉందని తెలియజేశారు. యూట్యూబ్ ఛానల్‌తో అక్షర పటేల్ మాట్లాడారు. రిటైర్మెంట్ తరువా హాబీనా అని యూట్యాబర్ అడగడంతో బుమ్రా మాకు పార్ట్‌నర్‌షిప్ ఇవ్వాలని కోరారు. గతంలో సిరాజ్‌కు బుమ్రా పర్‌ఫ్యూమ్ ఇస్తానని మాటిచ్చాడని గుర్తు చేశారు. వెస్టిండీస్ ఆటగాడు జోమెల్ వారికన్ వాసన నచ్చడంతో ఏ పర్‌ప్యూమ్ అని అడగడంతో పాటు ఆ పర్‌ఫ్యూమ్ ఇవ్వాలని బుమ్రాను అడిగాడు. అప్పుడు సిరాజ్ కూడా కలుగజేసుకొని ఆ పర్‌ఫ్యూమ్ తనకు కూడా కావాలని కోరడంతో ఇద్దరికి ఇస్తానని చెప్పాడు.