న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ (202627) ప్రవేశ పెట్టనున్న తరుణంలో వివిధ ఆర్థిక రంగ నిపుణులు, మేథావుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం భేటీ కానున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, భారత్ నుంచి ఎగుమతులపై అమెరికా 50 శాతం టారిఫ్‌ల విధింపు తదితర పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ భేటీకి నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్‌సుబ్రమణ్యం, ఇతర సభ్యులు కూడా పాల్గొంటారు.