టి-20 ఫార్మాట్‌లో పెను సంచలనం జరిగింది. ఫార్మాట్ చరిత్రలోనే ఓ బౌలర్ ఏకంగా ఎనిమిది వికెట్లు తీశాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమంగా ఏడు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. తాజాగా మయన్మార్‌తో జరిగిన అంతర్జాతీయ టి-20 మ్యాచ్‌లో భూటాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనమ్ ఎషే 8 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మొత్తం నాలుగు ఓవర్లు (ఒక మెయిడిన్) వేసిన సోనమ్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. సోషమ్ ప్రదర్శనతో భూటాన్ ఈ మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భూటాన్ 127 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో మయన్మార్ 9.2 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భూటాన్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకంది.