రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాపై ఉన్న అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సినిమాలో ఎలిజిబెత్ పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఓ వింటేజ్ బ్లాక్ కారు ముందు నిలుచుని ఉంది. వెనుకవైపు సమాధి రాళ్లు, రాతి దేవదూత విగ్రహాతో శ్మశానం ఉన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ తరహా బ్యాక్‌డ్రాప్ ఒక భయానకమైన వాతావరణాన్ని తలపిస్తోంది.
యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.