హైదరాబాద్: శాసన సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తానని, కెసిఆర్‌ను ఇవాళే కాదు ఆస్ప్రతిలో కూడా కలిశానని వివరణ ఇచ్చాడు. అసెంబ్లీ నుంచి వెంటనే ఎందుకు వెళ్లారో కెసిఆర్‌ను అడగాలని రేవంత్ మీడియాకు సూచించారు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తాము మాట్లాడుకున్నది మీడియాకు ఎలా చెబుతామని నవ్వుతూ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే కెసిఆర్ వద్దకు రేవంత్ వెళ్లి కరచాలనం చేశారు. బాగున్నారా? అని కెసిఆర్‌ను రేవంత్ అడిగారు. తరువాత ఎంఎల్‌ఎలు, మంత్రులు కెసిఆర్ కలిసి నమస్కరించారు. ఆరోగ్య పరిస్థితులపై వాకబు చేశారు. శాసన సభలో కెసిఆర్ మూడు నిమిషాలు మాత్రమే ఉన్నారు.