హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశం ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపు ఎమ్ఎల్ఎ లకు బిఆర్ఎస్ డోర్స్ క్లోజ్ అని అన్నారు. కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందని, సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు 80 శాతం ఫలితాలు వచ్చాయని తెలియజేశారు. కాంగ్రెస్ కు భయం మొదలైందని.. అందుకే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదని అన్నారు. ఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోతున్నారని, మున్సిపల్ ఎన్నికలకు..తనను లేకుండా చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. తాను లోపల ఉన్నా..పార్టీ చూసుకుంటుందని, తాను బెదిరింపులకు భయపడనని కెటిఆర్ పేర్కొన్నారు.