అందాల తార భాగ్యశ్రీ బోర్సే ఇటీవల ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షనులను అలరించింది. అయితే అమ్మడు నెక్స్ అక్కినేని అఖిల్‌తో లెనిన్ సినిమా చేస్తుంది. మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్న లెనిన్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నారు.
కానీ కొంత షెడ్యూల్ అయ్యాక శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకోవడం జరిగింది. అసలైతే లెనిన్ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా వేసవిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాపై భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.