మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో విపక్షాల విమర్శల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులను అప్రమత్తం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశం ము గిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్‌లో అత్యవసరంగా మంత్రులతో స మావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అసెం బ్లీ, కౌన్సిల్‌ను వేదికగా చేసుకునేందుకు విపక్షాలు సిద్ధం గా ఉన్నాయి కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వారు చేసే విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సూచించారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్ తన ఉనికి ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీని వేదిక గా చేసుకునే ప్రయత్నం
చేస్తుందన్నారు. కాబట్టి మీరూ అప్రమత్తంగా ఉంటూ వారి విమర్శలను తిప్పికొట్టాలనాన్నరు. ఈ విషయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు తమ జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలను అప్రమత్తంగా ఉంచుకోవాలని, అంతేకాకుండా వారికీ సరైన సమాచారం ఇచ్చి అవగాహన కల్పించి, అవసరమైతే మాట్లాడించే ప్రయత్నం చేయాలన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను సభలో ఎండగట్టాలని ఆయన సూచించారు. అన్నీ ముఖ్యమంత్రి చూసుకుంటారులే అని భావించరాదన్నారు. సభలో మీతో పాటు ఎమ్మెల్యేల అటెండెన్స్ కూడా ఉండాలని, సభలో ఎప్పుడూ పాలకపక్షం నిండుగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం బిఆర్‌ఎస్ పట్టుబట్టే అవకాశం ఉందన్న అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.