‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకురాలు సుధా కొంగరా. ఆమె దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పరాశక్తి’. శివకార్తీకేయన్ హీరోగా నటించిన ఈ సినిమాతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026, జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం పరాశక్తి ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు సుధా కొంగర. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాలన్నది తన డ్రీమ్ అని అన్నారు. ‘‘నాకు లవ్‌స్టోరీలంటే చాలా ఇష్టం. పూర్తిస్థాయి ప్రేమకథను తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది రజనీకాంత్ సర్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికే నా వద్ద కథ ఉంది. దాన్ని డెవలప్ చేయాలి. నేను అలసిపోయా అందుకే త్వరగానే రిటైర్ కావాలని అనుకుంటున్నా’’ అని సుధా కొంగర పేర్కొన్నారు.