హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పరిధి టాటానగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. మైలార్ దేవ్ పల్లిలో ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ వస్తువులు దగ్ధం కావడంతో దట్టంగా పొగ వ్యాపించింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్య్కూట్ వల్లే జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ప్రమాద సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.