హైదరాబాద్: రెండేళ్ల నుంచి కెసిఆర్ ఫాంహౌస్ లోనే ఉన్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గ్రామసర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు రాలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ ఎస్ హయాంలో పేదలకు ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ నెలకు రూ. 5 లక్షల జీతం తీసుకుంటూ.. ప్రజా సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. 24 నెలల తర్వాత కెసిఆర్ తమ లెక్కలు చూస్తా అంటున్నారని, బిఆర్ఎస్ నేతల మాటలను పట్టికోం అని తెలియజేశారు. ముందు తెలంగాణ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అడిగిన లెక్కలు, కాళేశ్వరం లెక్కలు కెసిఆర్ చెప్పాలని సమాధానం చెప్పాలని అన్నారు. ఉపాధి హామీలపై జనవరి 5 నుంచి ఉద్యమం చేస్తామని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.