బెంగళూరు: నవ దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యువతి గానవి(26), యువకుడు సూరజ్(29) నెల రోజుల క్రితం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రోజు నుంచి దంపతుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగున్నాయి. నవ వధువుకు మరో యువకుడితో స్నేహం ఉందని అనుమానం పెంచుకున్నాడు. నవ వరుడు సంసారానికి పనికి రాడని తన కుటుంబ సభ్యులకు వధువు చెప్పడంతో ఇద్దరు మధ్య ఇరు కుటుంబాల సభ్యులు రాజీ కుదుర్చడానికి ప్రయత్నించారు. హనీమూన్‌కు వెళ్లి వస్తే అన్నీ సర్ధుకుంటాయని ఇద్దరు నచ్చజెప్పారు. హనీమూన్ కోసం ఇద్దరిని శ్రీలంకకు పది రోజులు ఉండడాలని కుటుంభ సభ్యులు పంపించారు. నాలుగు రోజులకే ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. వెంటనే శ్రీలంక నుంచి బెంగళూరులోని రామమూర్తి నగరలోని తన పుట్టింటికి గానవి వెళ్లిపోయింది. రూమ్‌లోకి వెళ్లి గానవి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన నవ వరుడు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు చనిపోవడంతో అతడి తల్లి జయంతి కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అనుమానం నవ దంపతుల ప్రాణం తీసింది.