హైదరాబాద్: కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో ఈగల్ బృందం సోదాలు నిర్వహించింది. ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. మొత్తం 14 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా క్వేక్ పబ్‌లో ఉక్రెయిన్‌కి చెందిన ప్రముఖ డిజె ఆర్బాట్స్‌తో కాన్సర్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులతో కలిసి ఈగల్ బృందం పలు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించింది. డ్రగ్స్ కేసులో 10 రోజుల్లో 27 మందిని ఈగల్ బృందం అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో నలుగురు విదేశీ మహిళలతో సహా 17 మంది వినియోగదారులు ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 68 గ్రాముల కొకైన్, 50.5 గ్రాముల ఎండిఎంఎ, 382 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.