నారాయణఖేఢ్: సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేఢ్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారిపై కల్వర్టు గుంతలో పడి ముగ్గురు దుర్మరణం చెందారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడడంతో ముగ్గురు యువకులు చనిపోయారు. కొత్తగా నిర్మిస్తున్న 161బి జాతీయ రహదారిపై కల్వర్టు కోసం గుంతలు తవ్వారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆవుటి నర్సింహులు(27), జిన్న మల్లేశ్(24), జిన్న మహేశ్(23) మృతి చెందారు. మృతులు నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ వాసులుగా గుర్తించారు.