గొల్లపల్లి: బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు దంపతులు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్బపూర్ గ్రామానికి చెందిన రెడ్డపాక లింగయ్య, లచ్చవ్వ అనే దంపతులు పనులు నిమిత్తం ఆదివారం ఉదయం లూనాపై (ద్విచక్రవాహనం) జగిత్యాలకు వెళ్తున్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట శివారులోకి చేరుకొని లూనాపై వెళ్తుండగా ఎదురుగా కారు ఢీకొట్టడంతో రోడ్డు మీద ఎగిరిపడ్డారు. భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందగా లింగయ్య తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ కృష్ణ సాగర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.