మన తెలంగాణ / హైదరాబాద్: ఆసిఫాబాద్ బస్ డిపో డ్రైవర్‌పై అక్రమ కేసు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి రిమాండ్‌కు పంపిన రెబ్బనా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌టిసి జెఎసి డిమాండ్ చేసింది. ఈ నెల 23 న ఆసిఫాబాద్ డిపో లహరి బస్సు డ్రైవర్ రామరావు హైదరాబాద్ నుండి అసిఫాబాద్ వెళుతుండగా రెబ్బన పోలీస్ స్టేషన్ సమీపంలో తన బస్సును ఎడమ వైపు రోడ్డు ప్రక్కన పూర్తి సైడ్ లో ఇండికెటర్ లైట్స్ వేసి ఆపినట్లు ఆర్‌టిసి జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్ బి. యాదగిరి లు తెలిపారు. కొద్ది సేపటికి వెనుక నుండి వచ్చిన బొలెరో వాహనం స్పీడ్ గా వచ్చి బస్సుకు వెనుక ఎడమ భాగంలో డీ కొట్టడం వల్ల బొలెరో డ్రైవర్ తీవ్ర గాయలతో చికిత్స పొందుతూ హస్పెటల్ లో చనిపోయాడన్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే రెబ్బన పోలీసులు ఆర్‌టిసి డ్రైవర్ తప్పు లేకపోయినా, బస్సును తెల్లగీత వొదిలి చాలా దూరం లో బస్సు పక్కకు పెట్టింది ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి, అన్యాయంగా అరెస్ట్ చేసి అతని పై నాన్ బేయిలబుల్ కేసు పెట్టి రిమండ్ కు పంపారని అన్నారు. ఇది దుర్మార్గo అని, ఆర్‌టిసి చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. ఆర్‌టిసి యాజమాన్యం ఈ సంఘటన పట్ల తక్షణమే సీరియస్ గా స్పందించి పోలీస్ ఉన్నతధికార్లతో మాట్లాడి డ్రైవర్ పై నమోదు చేసిన అక్రమ కేసును ఉపాసంహరింపచేసి డ్రైవర్ ను రిమాoడ్ నుండి విడుదల చేయించాలని కోరారు. ఆర్‌టిసి బస్సు డ్రైవర్ పై కాకుండ బొలెరో వాహనం డ్రైవర్ పైనే కేసు బుక్ చేయించడంలో గాని ఆర్‌టిసి డ్రైవర్ రిమాoడ్ కు పోకుండా ఆపడంలో ఆసిఫాబాద్ డిఎం నిర్లక్ష్యం ప్రధానంగా ఉందని తెలిపారు., ఆర్‌టిసి డ్రైవర్ పై పెట్టిన అక్రమ కేసు ఎత్తి వేసి భే షరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.