జగిత్యాల: ఫోన్‌లో అభ్యంతరకర వీడియోలు రికార్డు చేసి అక్కచెల్లెళ్ల పెళ్లి సంబంధాలను చెడగొడుతూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిని హత్య చేశారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బుర్ర మహేందర్(32) అనే వ్యక్తి హైదరాబాద్‌లో మెడికల్ రిప్రిజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. జగిత్యాలకు చెందిన అక్కాచెల్లెళ్లు హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. చెల్లితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ఆమె అక్కతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
అశ్లీల దృశ్యాలను తన తన ఫొన్‌లో రికార్డు చేశాడు. ఇటీవల యువతి పెళ్లి సంబంధాలు రావడంతో అశ్లీల వీడియోలు చూపించి చెడగొట్టాడు. దీంతో అక్కాచెల్లెలు మహేందర్‌పై పగ పెంచుకున్నారు. ప్లాన్ ప్రకారం మహేందర్‌కు ఫోన్ చేసి తన గ్రామానికి రావాలని సమాచారం ఇచ్చారు. రాత్రి పది గంటల సమయంలో అక్కా చెల్లెళ్లు మహేందర్‌తో గొడవకు దిగారు. వెంటనే మహేందర్ కళ్లలో కారం చల్లి కర్రలతో చికతబాదారు. అక్క కుమారుడు, మరో బంధువుతో కలిసి అతడిని కర్రలతో కొట్టడంతో తలక బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేందర్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని తుర్కలమద్దికుంట గ్రామంగా గుర్తించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.