హైదరాబాద్: డిపెండెంట్ ఉద్యోగుల అంశం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గతంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు రద్దు చేస్తే మాజీ సిఎం కెసిఆర్ పునరుద్ధరించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఉద్యోగుల్లో సగం మంది డిపెండెంట్ ఉద్యోగులే ఉన్నారని, ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిందని తెలియజేశారు. కార్మికులపై కక్ష కట్టినట్లు సిఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, సింగరేణి నిధులను సిఎం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మెస్సీ టూర్ కోసం సింగరేణి నిధులు ఎందుకు వాడారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. సింగరేణి నిధుల దుర్వినియోగంపై అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తామని, అధికారంలోకి వచ్చాక విచారణ చేసి తప్పు చేసిన వారిని జైల్లో పెడతామని పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందని, తక్షణమే మెడికల్ బోర్డు కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. లేకుంటే కార్మికుల పిల్లలతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇల్లు ముట్టడిస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.