బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ శనివారం తన 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకూ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకే స్టైల్‌లో సినిమాలు చేయకుండా.. రకరకాలుగా ప్రయోగాలు చేయడంలో సల్మాన్ ఖాన్ ముందుంటారు. అలా చేసిన సినిమాలు చాలా వరకూ సూపర్ హిట్లు అయ్యాయి. అలా సల్మాన్ చేస్తున్నలేటెస్ట్ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. అపూర్వ లఖియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రాంగధ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్. ఇక సల్మాన్ ఖాన్ సోల్జర్ పాత్రలో కనిపించనున్నారు. కాగా, సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. టీజర్ విజువల్స్, బిజిఎం అంతా ఆకర్షనీయంగా ఉంది. హిమేష్ రేష్మియా అందించిన సంగీతం ప్రత్యేక హైలైట్. ఇక ఈ సినిమా 2026, ఏప్రిల్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.