కిలో వెండి ధర రూ.2.50 లక్షలకు చేరింది. నెల రోజుల్లోనే రూ.80,000 పెరిగి ఆల్‌టైమ్ హైకి చేరింది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,000 మార్కును దాటగా… 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,000 పలుకుతోంది. ఈ రెండు విలువైన లోహాలలో బుల్లిష్ ట్రెండ్ చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. శుక్రవారంతో పోల్చుకుంటే పసిడి ధర రూ.1,200 పెరిగింది. అదేవిధంగా 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.1,31,000కి చేరుకుంది. కాగా, ఈ సంవత్సరం బంగారం ధర 70 శాతానికిపైన పెరిగిందని, 1979 తర్వాత ఇదే పెద్దమొత్తంలో వార్షిక లాభమని నిపుణులు చేబుతున్నారు.