హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు పరారీలో ఉన్నాడు. ఈగల్ టీం, మాసబ్ట్యాంక్ పోలీసులు హీరోయిన్ సోదరుడి కోసం గాలిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అరెస్టుతో నటి సోదరుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి నటి సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేశాడు. ఇద్దరు వ్యాపారులన నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండిఎంఎ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.