మన తెలంగాణ/మహబూబాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజ ల్లో మార్పు మొదలైందని, కాంగ్రెస్‌ను ఇక నమ్మే పరిస్థితి లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. మానుకోట పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో బిఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన కొత్త సర్పంచుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మా ట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 45% గెలిచింద ని.. అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనేది అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పె ట్టుకొని ఇతరులు తక్కువ ఓట్లతో గెలిచినాడ కాంగ్రెస్ మ ద్దతుదారులు గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారని మండిపడ్డారు. ముసలమ్మకు ముసలయ్యకు రూ.4,000 పెన్షన్ ఏమైందని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ‘ఆఖరికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీపై కూడా ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి ఆరచేతిలో వైకుంఠ చూపెట్టావ్’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ‘
పాలన చేతకాక కెసిఆర్‌ను తిడుతూ కాలం గడుపుతున్నావని.. నీకు లాగా సంస్కారహీనులం కాదు’ అని హితబోధ చేశారు. ఏ ఎమ్మెల్యేకు భయపడాల్సిన అవసరం లేదని, రాజ్యాంగం ద్వారానే అన్ని నిధులు వస్తాయని గెలిచిన సర్పంచులకు భరోసానిచ్చారు. ఓడిన అభ్యర్థులకు సైతం బలంగా కష్టపడ్డారంటూ మనోధైర్యాన్ని నింపారు. మానుకోటను, తండాలను, గూడేలను అభివృద్ధి చేసింది కెసిఆర్ ఒక్కరేనని అన్నారు. మానుకోటను జిల్లాగా కేంద్రంగా మార్చి అభివృద్ధి పరుగులు పెట్టించింది కెసిఆర్ అని కలెక్టరేట్ కార్యాలయం, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్రంథాలయం, కూరగాయల మార్కెట్, నూతన మున్సిపల్ కార్యాలయం, ఇలా ఎన్నో చేశారని అన్నారు. అభివృద్ధి కోసం గ్రామపంచాయతీకి ట్రాక్టర్ డంపింగ్ యార్డ్, వైకుంఠధామం,
నర్సరీని అందించి దేశంలో ఆదర్శవంతమైన గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దామని అన్నారు. బిఆర్‌ఎస్ హయాంలోనే ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు వచ్చాయని అన్నారు. తమ ప్రభుత్వంలోనే గ్రామపంచాయతీలు భారతదేశానికి పట్టుగొమ్మలుగా మారాయని, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు తెలంగాణకు 30 శాతం అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని అన్నారు. ఆ ఘనత పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లిది అని, ఆయనను నడిపించిన కెసిఆర్‌దేనని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీంద్రరావు, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ , దయాకర్ రావు, మాజీ ఎంపి కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, జిల్లా తదితరులు పాల్గొన్నారు.