హైదరాబాద్: ఎటిఎం సెంటర్లలో దొంగలు హల్‌చల్ చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఒకే రోజు రెండు ఎటిఎంలలో చోరీకి యత్నించారు. యంత్రాలు తెరుచుకోకపోవడంతో ఎటిఎంలకు దుండగులు నిప్పంటించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 4వ, 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్బిఐ ఎటిఎం తెరవడానికి ప్రయత్నించారు. ఓపెన్ కాకపోవడంతో ఎటిఎంను దుండగులు తగలబెట్టారు. సుమారు రూ.27 లక్షల నగదు పూర్తిగా దహనమైంది. రెండో ఎటిఎం కూడా ఓపెన్ కాకపోవడంతో తగలబెట్టారు. దాదాపుగా రూ.25 లక్షల నగదు ఉన్నట్లు తెలిసింది.